గ్లోబల్ సమ్మిట్‌కి పిలిచి అవమానించారు: రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

గ్లోబల్ సమ్మిట్‌కి పిలిచి అవమానించారు: రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

గ్లోబల్ సమ్మిట్‌కి పిలిచి అవమానించారు: రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన గ్లోబల్‌కు సమ్మిట్‌కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోల్‌మాల్ సమ్మిట్‌ అని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థ బ్రోచర్ ఓపెనింగ్‌లా ఉందని విమర్శించారు. ఇక్కడికి పిలిచి అవమానించారు.. ఎమ్మెల్యేలను పట్టించుకునే నాథుడే లేదు.. కనీసం కుర్చీ వేసిన దిక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 200 ఏళ్ల తర్వాత జరిగే అభివృద్ధి ఎవరికి అవసరం.. ముందు ప్రజలను కనీస అవసరాలు తీర్చాలని సూచించారు. ఇచ్చిన హమీలు గాలికి వదిలి.. ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో గ్రాఫిక్‌ షో చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. దమ్ముంటే.. ఆదివాసీ, లంబాడీ తండాల్లో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించాలని అన్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్‌ సమ్మిట్‌‌ను నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది దేశ, విదేశాలకు చెందిన అతిరథ మహారథులు సమ్మిట్‌కు తరలివచ్చారు. తొలి రోజు సమ్మిట్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్‌ మీడియా ప్రకటించింది. ఫ్యూచర్‌ సిటీలో జూ పార్క్​ ఏర్పాటుకు ముఖేష్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ నిర్వహించే వంతారా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే విన్‌ గ్రూప్‌ ఇండస్ట్రీస్ రూ.27 వేల కోట్లతో, ఏజీఐడీసీ సంస్థ రూ.70 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి విద్యుత్‌ సంస్థలతో భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టిందని, రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆదాని గ్రూప్‌ ప్రకటించింది. రెండో రోజు మరిన్ని కంపెనీలు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

Next Story