- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిల్ట్ పాలసీ రూపకల్పనలో పారదర్శకత కొరవడింది: బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
రాష్ట్రంలో హిల్ట్ పాలసీ పారిశ్రామిక విధానం ప్రకారం ఓఆర్ఆర్లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల భూములను మల్టి యూజ్ జోన్లుగా కన్వర్షన్ చేయడంలో పాదర్శకత కొరవడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హిల్ట్ పాలసీ పారిశ్రామిక విధానం ప్రకారం ఓఆర్ఆర్లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల భూములను మల్టి యూజ్ జోన్లుగా కన్వర్షన్ చేయడంలో పాదర్శకత కొరవడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ హాయంలో జరిగిన పారిశ్రామిక భూముల బదలాయింపు అక్రమాలు, విజన్ 2047 జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు వివరాలు సభలో తెలపాలని డిమాండ్చేశారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సాగునీటి రంగంలో అనేక సమస్యలు ఉన్నాయని, వ్యవసాయరంగ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కార్డుకు చట్టబద్దత దస్త్రంపై సిఎంగా తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి క్యాబినెట్ తొలి భేటీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని ఆమోదం తెలిపి రెండేండ్లు దాటినా ఆరుగ్యారంటీలకు చట్టబద్దత ఎందుకు చేయాలేదో చెప్పాలన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉపాధి అవకాశాల వంటి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని, మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యారంగం, పంచాయతీరాజ్ శాఖలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలు, పౌరసరఫరాల శాఖలో అవినీతి,
గృహ నిర్మాణ శాఖ, సామాజిక పెన్షన్లు, రెవెన్యూ శాఖలో భూముల సమస్యలకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మాదిరే కార్పోరేషన్ల ద్వారా రుణాలు భూముల తనఖా ద్వారా రుణాల సమీకరణ రెవెన్యూ పెరుగుదల లేకపోవడంతో ఆర్ధిక సంక్షోభం దిశగా రాష్ట్ర పయనం చేస్తుందన్నారు. గ్రేటర్నగరం విస్తరణ, డివిజన్లను 300కు పెంచడంపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమై భారీగా నష్టం జరిగిందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు వరదలకు పలువురి మృతి, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వేల ఎకరాల్లో పంటనష్టం, వాటికి పరిహారం పలు గ్రామాల్లో కూలిన పేదల ఇండ్లు చాలా చోట్ల తెగిన రోడ్లు, గండ్లు పడిన చెరువులలకు తక్షణమే మరమ్మతులు చేపట్టే అంశాలను సభలో ప్రస్తావించాలని కోరారు.






