ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు?: ఏలేటి

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయబోతున్న గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎలా కల్పిస్తారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు?: ఏలేటి
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయబోతున్న గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎలా కల్పిస్తారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Reddy) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకొని బతుకుతున్న వారంతా.. ఉపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. గ్రామాల్లో పన్నులు సైతం పెరుగుతాయని.. వారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోతున్నారో చెప్పాలన్నారు. ప్రత్యేక నిధులు ఏమైనా ఇస్తున్నారా తెలపాలన్నారు. కమిటీ వేసి ఏం స్టడీ చేశారని.. ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మహేశ్వర్‌రెడ్డిపై శ్రీధర్‌బాబు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయిలో అమలవుతుందని చెప్పారు. అయినా.. గాంధీ పేరును తొలగించి మీరు ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడే హక్కు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకానికి తూట్లు పొడిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రంతో మాట్లాడి అర్బన్ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరాలని సూచించారు.

Next Story