HYD: బీజేపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన.. రేవంత్ ప్రభుత్వానికి డెడ్‌లైన్

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-10 12:18:59  IST  )

హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా(Hydra), రెరా(RERA), జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులకు బీజేపీ(BJP) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(Katipalli Venkataramana Reddy) మంగళవారం ఫిర్యాదు చేశారు.

HYD: బీజేపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన.. రేవంత్ ప్రభుత్వానికి డెడ్‌లైన్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా(Hydra), రెరా(RERA), జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులకు బీజేపీ(BJP) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(Katipalli Venkataramana Reddy) మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ(Assembly) సమావేశాల్లోగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని.. లేదంటే అసెంబ్లీలో గళం విప్పుతామని కీలక ప్రకటన చేశారు. ‘మొత్తం ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించాను. తాను మాట్లాడిన పది రోజులకు అధికారులు స్పందించి.. అనుమతులు ఉన్న వాటి జోలికి వెళ్లబోమని అన్నారు’ అని మండిపడ్డారు. మరి అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు? వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Next Story