- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: జూబ్లీహిల్స్ లో టీడీపీ మద్దతుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ లో బీజేపీ మద్దతుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills bypoll) ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహింస్తున్నాయి. అందరి మద్దతు కూడగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కూటమి పార్టీల మద్దతు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని జనసేన నిన్న ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ లో నిన్న బీజేపీ స్టేట్ చీఫ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. అయితే నిన్న జనసేన మద్దతు ప్రకటించిన వేళ ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ టీడీపీ మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో (Jana Sena) పాటు టీడీపీ కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తోందన్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన శ్రీనివాస వర్మ ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కూడా జూబ్లీహిల్స్ లో బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తుందన్నారు.
అధికారికంగా చెప్పని టీడీపీ:అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తటస్థంగా ఉండాలని గతంలోనే అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ కోరితే మద్దతు ఇద్దామని చెప్పారు. కానీ అటువంటి ప్రయత్నం తెలంగాణ బీజేపీ వైపు నుంచి జరగలేదు. దాంతో ఇప్పటి వరకు మద్దతు (TDP support)విషయంలో టీడీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే నిన్న జనసేన మద్దతు తెలిపిన క్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ (Srinivasa Varma) మాత్రం టీడీపీ మద్దతు బీజేపీకే అని ప్రకటించడం ఆసక్తిగా మారింది.
బీఆర్ఎస్ తో మాకు సంబంధం లేదు:
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస వర్మ బీఆర్ఎస్‍పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‍కు బీజేపీతో సంబంధం లేదని కేంద్రంలో ఆ పార్టీ మాకు సపోర్ట్ చేయడం లేదన్నారు. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని చెప్పారు. సానుభూతిని అధిగమించి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి వైపు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‍కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు.






