- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ కొన్ని సీట్లు గెలవొచ్చు.. అధికారంలోకి మాత్రం రాదు: కూనంనేని కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చేమో కానీ, అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చేమో కానీ, అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మతపరమైన విభజన, మతం అనే పునాదులపైనే బీజేపీ నిలబడి ఉందని ఆయన విమర్శించారు. ఇవాళ ముగ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జైత్రయాత్ర చేస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అందుకే ప్రజా సమస్యలపై సీపీఐ శ్రేణులు నిరంతరం పోరాడాలని కూనంనేని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఎన్నికల కార్యాచరణను ప్రకటిస్తూ.. పొత్తు ఉంటే కనీసం 5 స్థానాల్లో, లేదంటే ఒంటరిగా 15 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో బలంగా ఉన్న 40 నియోజకవర్గాలను గుర్తించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు ఆయా ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, జూన్ 15న ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై కార్యక్రమాలు, సెప్టెంబర్ 28న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు కూనంనేని వెల్లడించారు.






