- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: పిల్లల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంపొందించాలి.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
పిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్లు అని, వాళ్లకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాలని మల్కాజ్‌గిరి(Malkajgiri) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eatala Rajendar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్లు అని, వాళ్లకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాలని మల్కాజ్‌గిరి(Malkajgiri) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eatala Rajendar) అన్నారు. సనత్ నగర్ లో హిందు పబ్లిక్ స్కూల్(Hindhu Public School) 37 వ వార్షికోత్సవ కార్యక్రమానికి మర్రి శశిధర్ రెడ్డి(Marri Shashidhar Reddy)తో కలిసి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు ఎంత కష్టపడి ఎదిగినా ఒక మంచి నాయకుడు లేకపోతే ఇవన్నీ వ్యర్థం అవుతాయని, సమాజానికి మంచి ఇంజనీర్లు డాక్టర్స్ ఎంత అవసరంలో నాయకులు కూడా అంతే అవసరం అని చెప్పారు. అందుకే పిల్లలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంపొందించాలని, మార్కులు చదువే కాదు సామాజిక జ్ఞానం కూడా ఉండాలని, అన్నిరంగాల్లో ఎదిగితేనే సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్టు అని, అప్పుడే ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడతారని స్పష్టం చేశారు.
కార్పొరేట్ స్కూల్ చదువుతున్న పిల్లలు మందలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మేము చదువుతున్నప్పుడు సార్లు తొడపాశం పెట్టేవారని, కానీ ఈనాడు మందలిస్తే తల్లిదండ్రులు వెళ్లి గొడవ పెట్టుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లల్ని మందలించేది వారి మంచికోసమే అని మర్చిపోవద్దని సూచించారు. సెల్ ఫోన్ వల్ల ఎంత లాభమో అంత నష్టం కూడా ఉందని, పిల్లలు ఫోన్ లో ఆడుకుంటూ కనీసం అమ్మానాన్నలతో మాట్లాడడం లేదని, పిల్లలను సెల్ ఫోన్ కి బానిసలు కాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. పిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్లు అని, వారి మెదడు మీద ఏం రాస్తే అదే శాశ్వతంగా ఉంటుందని అన్నారు. అందుకే జాగ్రత్తగా మలచాలని, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పి.. మానవవిలువలు నేర్పాలని చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థుల టెన్షన్ తగ్గించడానికి స్వయంగా దేశ ప్రధాని వారితో ఇంటరాక్ట్ అవుతున్నారని, అంటే ఆయన ఎంత సునిశితంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి అనేది ఆయన స్వార్థం అని, ఆ సత్తా విద్యార్థులకే ఉంది అని ఆయన భావిస్తున్నారు కాబట్టే మీతో ఇంటరాక్ట్ అవుతున్నారని వివరించారు. ఇక ప్రపంచానికి వాక్సిన్ అందించే జ్ఞానం ఉన్న దేశం భారత్ అని, చైనా కంటే కూడా భారత దేశం వేగంగా దూసుకుపోతుందని, వికసిత్ భారత్.. సుసంపన్న భారత దేశం లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని ఈటల అన్నారు.






