పేదల ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో చర్చించాలి.. బీజేపీ నేత ఏలేటి డిమాండ్

by Kema Shiva Kumar |

ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రైతు భరోసా, మూసీ కూల్చివేతలు, ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

పేదల ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో చర్చించాలి.. బీజేపీ నేత ఏలేటి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ (BRS) పార్టీ పూర్తిగా విఫలమైందని, ప్రస్తుతం బీజేపీ (BJP)యే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.

అసెంబ్లీలో రైతుల సమస్యలు, రైతు భరోసా ఎగ్గొట్టిన అంశం, ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి వెల్లడించారు. గుజరాత్‌ (Gujrat)లో సబర్మతి నది అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తే.. తెలంగాణలో మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. శాసనసభలో రేవంత్ సర్కారుపై పోరాటంలో బీఆర్ఎస్ వెనుకబడిందని, బీజేపీయే ప్రజల పక్షాన నిలబడుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story