TG News : రేవంత్ గారూ.. తులం బంగారం ఎక్కడ? : బీజేపీ నాయకురాలు శిల్పారెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా(TBWM) రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి(ShilpaReddy) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

TG News : రేవంత్ గారూ.. తులం బంగారం ఎక్కడ? : బీజేపీ నాయకురాలు శిల్పారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా(TBWM) రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి(ShilpaReddy) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పదే పదే చెబుతున్నారని, 15 నెలల్లో ఎంత మందిని కోటీశ్వరులన చేశారో వెంటనే ప్రకటించాలని శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ మహిళలు భావిస్తున్నారని విమర్శించారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది బీజేపీ మాత్రమేనని, మహిళలను కేంద్ర రక్షణ, ఆర్ధిక మంత్రులను, ముఖ్యమంత్రులను చేసింది తమ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమేనని.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అన్నగా భావిస్తే కడుపుకోతే మిగులుతుంది.

తులం బంగారం ఇస్తామని చెప్పి.. బెల్టు షాపులు తెరిచారుని, బెల్టు షాపుల పేరుతో అనేక మంది తాలి బొట్లు తెంపుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు. . కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న ముఖ్యమంత్రి ఒక్క మహిళనైనా పారిశ్రామిక వేత్తను చేశారా అని ప్రశ్నించారు. 600 బస్సులు ఇస్తామని చెప్పి కేవలం 20 బస్సులే ఇచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మహిళలకు రూ. 2500 కూడా నెరవేర్చలేదుని.. ప్రతి విషయంలో ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూనే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story