- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించడమే: రామచందర్ రావు
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ప్రజలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించడే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ప్రజలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించడే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. భారతదేశం చాలా ఉదారవాద దేశం అని చెప్పారు. దేశంలో ఎంతో మంది శరణార్థులు ఉన్నారని అన్నారు. భారత్ సెక్యులర్ కంట్రీ అని స్పష్టం చేశారు. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ అన్ని మతాలవారు నివసిస్తున్నారని చెప్పారు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే మైనార్టీలు క్షేమంగా ఉన్నారని రేవంత్ రెడ్డి స్పీచ్ ఇవ్వడం సరికాదన్నారు. మతవిద్వేశాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే శిక్షించేలా బిల్లును తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డే స్వయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని చెప్పారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ ప్రసంగం చేశారన్నారు. ఓట్ల కోసం ముస్లింలను రేవంత్ రెచ్చగొట్టాడని విమర్శించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ నాయకులు దేశాన్ని కూడా ద్వేషించడం మానుకోవాలన్నారు.






