పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ నేతలపై దాడి.. బీజేపీ నేత రచనా రెడ్డి

by Disha Web Desk 13 |
పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ నేతలపై దాడి.. బీజేపీ నేత రచనా రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : వారసత్వ రాజకీయాలకు చరమగీతం త్వరలో తప్పదని బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేతలపై జరిగిన దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాత్ర పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టామని ఇక్కడికి రాగానే దాడులకు దిగారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వి చిలుక పలుకులని ఎద్దేవా చేశారు. 500 మంది గుండాలతో ప్రాబ్లమ్ క్రియేట్ చేశారని ఆమె ఆరోపించారు. రాడ్లు, రాళ్లతో వచ్చి దాడులు చేశారన్నారు. కార్తీక్ అనే ఒక బీజేపీ నేతతో పాటు మల్లేష్ అనే సర్పంచ్‌కి తీవ్రగాయాలయ్యాయన్నారు. ఇప్పటి వరకు వారి ఆరోగ్య స్థితి విషమంగానే ఉందని తెలిపారు.

టీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, ఇంటెలిజెన్స్, స్పెష్ల బ్రాంచ్, స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నా కానీ పంద్రాగస్టున కావాలనే దాడి చేయించారని విమర్శలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పేవి పచ్చి అబద్ధమని ఫైరయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ నుంచి వర్క్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. స్థానిక సీపీ.. కేసీఆర్ సర్కారు కోసం పనిచేస్తున్నాడా..? అని మండిపడ్డారు. గొడవ అంతా అయిపోయాక అదనపు బలగాలను రక్షణ కోసం పంపిస్తే బండి సంజయ్ వద్దని పంపించేశారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు మహిళా కార్యకర్తలపై కూడా దాడులకు దిగుతున్నారన్నారు. కార్లు ధ్వంసం చేశారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఉన్నా ఇలా చేయడం తగదని రచనారెడ్డి మండిపడ్డారు. 12 రోజులుగా యాత్ర సజావుగా సాగుతోందని, ఇన్ని రోజులు లేని దురద టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతలు చేతకాని చేష్టలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి అంత దురద ఉంటే ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దళిత బంధు ఎవరికిచ్చారని, ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధారణంగా అందరూ ఎగబడుతారని, కానీ తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి చూసి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భయపడే స్థితికి వచ్చారన్నారు. టీఆర్ఎస్ నేతలకు సిగ్గు, లజ్జ ఉంటే సమస్యలు పరిష్కరించి చూపించాలన్నారు. పోలీసులు వారి డ్యూటీ వదిలేసి ప్రభుత్వానికి బానిసలుగా మారారని ఫైరయ్యారు. బీజేపీతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాలు దువ్వాలని చూస్తే వారికే సమస్య అని, ఈ విషయం ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని రచనారెడ్డి హెచ్చరించారు.

పాదయాత్రని చూసి కేసీఆర్ గజగజ వణుకుతుండు: బండి సంజయ్



Next Story

Most Viewed