యూనివర్సిటీ వీసీలుగా సగం బీసీలను నియమించాలి

by Mahesh |
యూనివర్సిటీ వీసీలుగా సగం బీసీలను నియమించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రములోని త్వరలో భర్తీ చేయనున్న తొమ్మిది యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పదవులలో సగం బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాజుల సీఎంకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రధాన యూనివర్సిటీ లో ఈ నెలాఖరు వరకు ఖాళీ అవుతున్న యూనివర్సిటీ వీసీ పోస్టుల్లో బీసీలకు కనీసం ఐదు వైస్ ఛాన్స్ లర్ పోస్టులను కేటాయించాలని కోరారు. ప్రధానంగా యూనివర్సిటీ పోస్టుల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీసీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా సెర్చ్ కమిటీలను నియమించినందున సెర్చ్ కమిటీలలో బీసీల పేర్లు ఉన్న లేకపోయినా బీసీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అన్ని అర్హతలు ఉండి ప్రతిభ మెరిట్ ఉన్న బీసీలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని ఆయన కోరారు. బీసీలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కులమే అనర్వహతగా మారుతుండడం చాలా బాధాకరమన్నారు. అన్ని అర్హతలు ఉన్న బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తించి వీసీ పోస్టుల భర్తీలో సమన్యాయం, సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలని సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed