షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలుగు కుర్రాడు అర్జున్‌కు డ్రా

by Harish |
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలుగు కుర్రాడు అర్జున్‌కు డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి 5వ రౌండ్‌లో డ్రా చేసుకున్నాడు. రష్యా ప్లేయర్ వోలోడార్ ముర్జిన్‌తో ఆడిన ఆడిన అర్జున్ 44 ఎత్తుల్లో పాయింట్లు పంచుకున్నాడు. ఈ టోర్నీలో అతనికి ఇదే తొలి డ్రా. ఐదు రౌండ్లలో మూడు విజయాలు సాధించిన అర్జున్.. ఓ ఓటమి, ఓ డ్రా పొందాడు. 3.5 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానాన్ని పంచుకున్నాడు. మరో భారత ఆటగాడు అరవింద్ చితంబరం అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఐదో రౌండ్‌లో యూఏఈ గ్రాండ్‌మాస్టర్ సలేం సలేహ్‌పై విజయం సాధించాడు. తెల్లపావులతో ఆడిన అతను 48 ఎత్తుల్లో విజయం సాధించాడు. దీంతో 4.5 పాయింట్లతో టాప్ పొజిషన్‌కు వెళ్లాడు. మరోవైపు, భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. ఎమ్రే కెన్(తుర్కియో) చేతిలో ఐదో రౌండ్‌ను కోల్పోయింది.

Next Story

Most Viewed