లోక్ సభ ఎన్నికల వేళ రూ.8,889 కోట్లు స్వాధీనం

by Shamantha N |
లోక్ సభ ఎన్నికల వేళ రూ.8,889 కోట్లు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల నగదు, డ్రగ్స్, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది ఈసీ. స్వాధీనం చేసుకున్న వాటిలో దాదాపు రూ.3,958 కోట్ల డ్రగ్స్ ఉన్నాయని తెలిపింది.

రూ.849.15 కోట్లు డబ్బు, రూ.814.85 కోట్ల విలువైన మద్యం, రూ.1,260.33కోట్ల బంగారు, వెండి నగలు రూ.2,006.59 కోట్ల ఉచితాలు ఉన్నట్లు తెలిపింది. డ్రగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసకున్నట్లు తెలిపింది. గుజరాత్ ఏటీఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు రూ.892 కోట్ల డ్రగ్స్ మూడు రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నట్ల వివరించింది.

గుజరాత్ లో అత్యధికంగా రూ.1,461.73 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకోగా.. రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో రూ.333.55 కోట్ల సొత్తు, ఏపీలో రూ.301.75 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

Next Story