డూ ఆర్ డై మ్యాచ్‌లో RCB భారీ స్కోర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

by Satheesh |
డూ ఆర్ డై మ్యాచ్‌లో RCB భారీ స్కోర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. సొంత గడ్డపై బ్యాటర్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో చెన్నైపై బెంగుళూరు భారీ స్కోర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగుళూరు బ్యాటర్లలో కోహ్లీ 47, డుప్లెసిస్, 54, పటిదార్ 41, గ్రీన్ 38, కార్తీక్ 14, మ్యాక్స్ వెల్ 16 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శార్థుల్ ఠాగూర్ 2, తుషార్ దేశ్ పాండే 1, శాంటర్న్ 1 వికెట్ తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 219 పరుగుల భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగింది. కాగా, మ్యాచ్‌లో 18 పరుగుల పై చిలుకు తేడాతో విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. 18 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓటమి పాలైన సరే చెన్నై ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్తుంది.

Next Story