లోక్ సభ ఎన్నికలు: సీ-విజిల్ యాప్ నకు 4.24 లక్షల ఫిర్యాదులు

by Shamantha N |
లోక్ సభ ఎన్నికలు: సీ-విజిల్ యాప్ నకు 4.24 లక్షల ఫిర్యాదులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘాలని భారీగా ఫిర్యాలు వచ్చాయి. సీ-విజిల్ యాప్ నకు రెండు నెలల వ్యవధిలోనే 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది ఈసీ. 99.9 శాతం కేసులను పరిష్కరించామని వివరించింది.

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించించారు. అయితే అప్పటినుంచి సీ విజల్ యాప్ నకు 4,24,317 ఫిర్యాదులు అందాయి. ఇందులో 4,23,908 కేసులను పరిష్కరించింది ఈసీ. దాదాపు 89 శాతం కేసులను 100 నిమిషాల్లోనే సాల్వ్ చేసినట్లు తెలిపింది ఈసీ. ఇంకా 409 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. దాదాపు 3.24 లక్షల కేసులు బ్యానర్లు, పోస్టర్లపైనే వచ్చాయంది.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ మొబైల్ యాప్.. సీ- విజిల్ ని రూపొందించింది ఈసీ. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో ఈసీకి కంప్లైంట్ చేయొచ్చు. ఈ కేసులను తక్కువ సమయంలోనే సాల్వ్ చేసేందుకు ఈసీ ప్రయత్నిస్తుంది. డబ్బు, మద్యం, డ్రగ్స్ పంపిణీ, రెచ్చగొట్టే ప్రసంగాలు, అసత్య ప్రచారాలు సహా ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలపై ఈ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. దాదాపు 100 నిమిషాల్లో ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.



Next Story

Most Viewed