- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ అరెస్టు కాకుండా సీఎం రేవంత్ రక్షణ: మహేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇచ్చిన హామీల అమలుపై చిత్తశుద్ధి లేదనడానికి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలే నిదర్శమని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇచ్చిన హామీల అమలుపై చిత్తశుద్ధి లేదనడానికి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలే నిదర్శమని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కేబినెట్‌కు ప్రజా సమస్యలు పట్టవని, ఇది హామీల ఎగవేతల సర్కారు అని మరోసారి నిరూపితమైందన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రులంతా రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత లాభాలు చూసుకుంటున్నారని, కమీషన్లు వచ్చే అంశాలపైనే కేబినెట్‌లో చర్చిస్తున్నారు తప్ప ప్రజాసమస్యల గురించి కాదనేది పబ్లిక్చర్చ జరుగుతుందన్నారు. మంత్రులు మీడియాకు ఉద్యోగులకు రెండు డీఏలు ఇప్పుడొకటి, ఆరు నెలల తర్వాత మరోకటి ఇస్తామని చెప్పారు. బకాయిలను నెలకు రూ.700 కోట్ల చొప్పున ఇస్తామంటూ ఉద్యోగులు డిమాండ్ చేసిన అంశాల్లో సగం కూడా ఇవ్వకుండా వారి ఆశలపై నీళ్లు చల్లి అన్యాయం చేశారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలోని 26వ పేజీలో తాము అధికారంలోకి రాగానే పెండింగులో ఉన్న డీఏలను తక్షణమే చెల్లిస్తామని, పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. సర్కార్ తీరు చూస్తుంటే గత ఏడాది ఖరీఫ్ సీజను రైతు భరోసా ఎగ్గొట్టినట్టుగానే ఈ ఖరీఫ్ సీజనుకు కూడా డబ్బులు ఇస్తారా, ఎగ్గొడుతారా అనేది రైతుల అనుమానంగా ఉందని ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌చేశారు. హామీలను ఎగ్గొట్టాలని చూస్తే సహించేది లేదని ఆయా వర్గాలతో కలిసి బీజేపీ పోరాడుతుంది. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి ఈ హామీలను అమలు చేయిస్తుందన్నారు. ఒకవేళ అమలు సాధ్యం కాదంటే కాంగ్రెసుకు అధికారంలో కొనసాగే అర్హత లేదు. రాజీనామా చేసి ప్రజాతీర్పును కోరాలి. అధికారంలో కొనసాగాలనుకుంటే కాంగ్రెస్ సర్కారు బకాయిలతో సహా ఈ హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. అప్పులు బారెడు అభివృద్ధి గుండుసున్నా ఏడాదిన్నరలో సాధించింది బకాయిలేనని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నరలో రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి కూడా పేనం నుంచి జారీ పొయ్యిలో పడినట్టయిందన్నారు.
కేసీఆర్ అరెస్టు కాకుండా సీఎం రేవంత్ రక్షణ :
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో చేస్తున్నదంతా డూప్ ఫైటింగ్అని గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిచే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలకు ఆయన కుటుంబాన్ని వేయి సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి ఉంటుందని సీఎంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఏమైంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ప్రశ్నించారు. వారిలో ఒక్కరిని కూడా ఒక్క రోజు కూడా జైల్లో పెట్టలేదు ఎందుకని, ఎవరు అడ్డుపడుతున్నారు. ఏంటీ మ్యాచ్ ఫిక్సింగ్. రాహుల్ గాంధీ ఏమైనా అడ్డుపడుతున్నారా అంటు నిలదీశారు. కేసిఆర్ సర్కార్ పదేళ్ల పాలనకు ఏమాత్రం తీసిపోని విధంగా రేవంత్ ప్రభుత్వం కూడా మూడు అక్రమాలు ఆరు అవినీతి అన్నట్టుగా పాలన సాగిస్తోంది.
కేసీఆర్ సర్కారు పదేళ్లలో చేసిన అవినీతిలో 30 శాతం రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నర పాలనలో చేసిందన్నారు. గత ఏడాదిన్నరలో జరిగిన అక్రమాలు కొన్నింటిని మేం బయటపెడితే, వాటిని కాంగ్రెస్ సర్కార్ విచారణ కాదు కదా, సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదు. అంటే ఆ సర్కారుపై అవినీతి ఆరోపణలు వస్తే దున్నపోతుపై వాన పడినట్టుగా ఉందన్నారు. అసలు చలనం లేని సర్కారు ఇది. ఈ ప్రభుత్వ పాలనలో నిజాయితీ మచ్చుకైనా లేదు. అయినా సరే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెడుతూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ అవినీతి బండరాన్ని ఎండగడుతామన్నారు.






