- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రిని మార్చే పనిమీదే ఆమె తెలంగాణకు వచ్చారు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అతి త్వరలో ముఖ్యమంత్రి(Chief Minister) మార్పు ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అతి త్వరలో ముఖ్యమంత్రి(Chief Minister) మార్పు ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. మిషన్ చేంజ్ టాస్క్‌పైనే మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తెలంగాణకు ఏఐసీసీ(AICC) ఇన్‌చార్జిగా వచ్చారని అన్నారు. డిసెంబర్ నెలలోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం పీఠంపై భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారని కీలక ఆరోపణలు చేశారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సర్కార్(Congress Government) పూర్తిగా గాడి తప్పింది. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఒక్క మంత్రి కూడా సీఎంను లెక్కచేయడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు.. మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలను గంగలో కలిపారని ఆరోపించారు. రైతులను సైతం వేధిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకే కింద నెగిటివ్ అయ్యేలా మంత్రులు బిహేవ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏం జరిగేది ఎవరికీ తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా మీనాక్షి నటరాజన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ముఖ్య నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.






