ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్నాం.. ఇక సహించం: బీజేఎల్పీ నేత ఏలేటి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్నాం.. ఇక సహించం: బీజేఎల్పీ నేత ఏలేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్మల్‌ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ పండుగలకు, ఉత్సవాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, చర్యలు లేవని మండిపడ్డారు. ముఖ్యంగా నిర్మల్ ఎస్పీ హిందువులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీపై చర్యల కోసం అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్నాం.. ఇకనుంచి సహించం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

Next Story