- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఏ క్షణమైనా CM మార్చు ఉండొచ్చు.. ఏలేటి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని ఆరోపించారు. వీరిద్దరి మూలంగా రాష్ట్ర మంత్రివర్గం కూడా రెండుగా చీలిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం, మంత్రుల మధ్య విభేదాల మూలంగా రాష్ట్రం దివాలా దీస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గం అసంతృప్తిగా ఉందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు వాఖ్యలతో పదేళ్లు మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని మంత్రులు బాధపడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు.. మంత్రివర్గ విస్తరణను కూడా పదే పదే రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పులన్నీ కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) దగ్గర ఉన్నాయని.. లోకల్‌బాడీ ఎన్నికల తర్వాత ఏక్షణమైనా రాష్ట్రంలో సీఎంను మార్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం అటు కాంగ్రెకస్ హైకమాండ్, ఇటు రాష్ట్ర నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.






