- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కోనుగోలు 80 శాతం జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు సిద్దమా..బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్
రైతుల సమస్యలపై బీజేపీ చేపట్టిన రైతు గోస పర్యటనతో రేవంత్ప్రభుత్వంలో కదలిక వచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు నెలల నుంచి సక్రమంగా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల సమస్యలపై బీజేపీ చేపట్టిన రైతు గోస పర్యటనతో రేవంత్ప్రభుత్వంలో కదలిక వచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు నెలల నుంచి సక్రమంగా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేపట్టిన పర్యటనలో రైతుల సమస్యలు అనేక గుర్తించామని, ఇకా నుంచి అన్నదాతల ఇబ్బందులపై సర్కారుపై సమరం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై నియంత్రణ లేదని, ప్రజల సంక్షేమంపై ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి ఎప్పడు విపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈసీజన్లో 80 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు చేసిన ప్రకటన అబ్దదమని, ఇప్పటికైనా నిజాలు మాట్లాడి రైతులను గందరగోళంలోకి నెట్టవద్దని సూచించారు.
రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోందని, రైతుల వద్ద కేంద్రం ధాన్యం కొనుగోలు చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. నాలుగు రోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి రైతాంగం ఆర్తనాదాలు విన్నామని బీజేపీ పోరాటం చేయగానే ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఆరోపించారు. ఇవే సమీక్షలు, పర్యటనలు మంత్రులు ముందే చేస్తే బాగుండేదని చురకలు వేశారు. ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదని నిలదీశారు. లారీ, హామాలీల ఖర్చు రైతులే చెల్లించేలా చేయడం దారుణమని, చివరి గింజ వరకు కొనే బాధ్యత తనదేనని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలా మారిపోయారని, ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరి, బుద్ధి మందగించడంతోనే బీజేపీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెట్రోల్, డీజల్‌పై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజల్‌పై 30 శాతం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా, ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పొద్దుతిరుగుడు, శనగలు కొనుగోలు చేస్తున్నామని ప్రకటన చేస్తున్న మంత్రి తుమ్మల ఎక్కడ రైతులకు కేంద్రాలు అందుబాటులో పెట్టారో చెప్పాలని డిమాండ్‌చేశారు.






