- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తా.. బీజేపీ నాయకురాలు మాధవీలత ప్రకటన
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నాయకురాలు మాధవీలత(Maadhavi Latha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నాయకురాలు మాధవీలత(Maadhavi Latha) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు కూడా ఉందని తెలిసింది. అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election)లో పోటీ చేస్తా.. ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నా అని మాధవీలత ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని బీఆర్ఎస్.. ఈ సీటు గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. షెడ్యూల్ రావడంతో జూబ్లీహిల్స్‌లో ప్రచారం జోరు మరింత పెరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.






