- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Boora Narsaiah Goud: మంత్రి జూపల్లిని కలిసిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్.. ఎందుకంటే?
గీత కార్మికుల హక్కుల కోసం మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గళమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ()గీత కార్మికుల హక్కుల కోసం మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (MP Boora Narsaiah Goud) గళమెత్తారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao)ను మర్యాదపూర్వకంగా కలిసి, గత ఎన్నికల సమయంలో కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలు గురించి విజ్ఞప్తి చేశారు. 20 నెలలు గడిచినా కార్మికులు నిరీక్షణలోనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోవడం సమాజానికి అన్యాయం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు తెలియజేశారు. అందులో మద్యం దుకాణాల రిజర్వేషన్‌ను పెంచి గీత సొసైటీలకే కేటాయించాలని తెలిపారు. కల్లు గీత కార్మికులకు రాష్ట్ర సొసైటీ (Toddy Tappers) ఏర్పాటు చేయాలన్నారు.
ఎక్స్గ్రేషియా బకాయిలను చెల్లించి మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తాటి సాగును ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకువచ్చి జాతీయ సబ్సిడీలు కల్పించాలన్నారు. ICAR ఆమోదంతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి తాటి హైబ్రిడ్ రకాలపై పరిశోధనలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. “మా సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ విశ్వసనీయతకు ప్రతీక” అని బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.






