- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ముంటే ఆ MP పేరు బయటపెట్టు.. కేటీఆర్‌కు ఏలేటి కౌంటర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో 400 ఎకరాల భూమికి సంబంధించి బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై తెలంగాణ

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో 400 ఎకరాల భూమికి సంబంధించి బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌కు బట్టకాల్చి మీదేయడం ఎప్పటినుంచో అలవాటని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణంలో బీజేపీ ఎంపీ(BJP MP) హస్తం ఉందనే ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. దమ్ముంటే.. ఆ ఎంపీ ఎవరో పేరు బయటపెట్టాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని బద్నాం చేయాలనేదే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి లక్ష్యమన్నారు.
ఇదిలా ఉండగా.. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందని.. ఆ 400 ఎకరాలతో రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనీ ఆరోపణలు చేశారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని..ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. అయితే.. బీజేపీ ఎంపీ హస్తముందని కేటీఆర్ ఆరోపించడంతో ఏలేటి స్పందించి పైవ్యాఖ్యలు చేశారు.






