- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ అబద్ధాల రాజకీయాలు బట్టబయలు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఎస్ఆర్విధానాన్ని అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించిందని గుర్తుచేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఓట్ల చోరీ జరుగుతోందంటూ, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలన్నీ ఎంతటి నిరాధారమైనవో నేడు దేశప్రజల ముందు సాక్ష్యాలతో సహా రుజువైందని స్పష్టం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకనే, కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు అనేవి ఓటర్ల జాబితాల సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయని కోర్టు తేల్చిచెప్పిందని, ఎస్ఐఆర్ ద్వారా ఈసీ తన పరిధి దాటి వ్యవహరించలేదని న్యాయస్థానమే క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు.
చొరబాటుదారుల సంరక్షక ఇండీ కూటమి అసలు రంగు నేడు దేశం ముందు పూర్తిగా బట్టబయలైందని, ఇండీ కూటమి పార్టీల ఓటు బ్యాంక్ బంధాలు మాత్రం బంగ్లాదేశ్‌తో ముడిపడ్డాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని హాకీంపురా' వంటి ప్రాంతాల్లో 'గత ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా నాలుగైదు సార్లు ఓట్లు వేశామని చొరబాటుదారులు కెమెరాల ముందే అంగీకరిస్తూ, ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి క్యూలు కడుతుండటం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరికలను అక్షరసత్యాలుగా నిరూపిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో బిజెపి అగ్రనాయకత్వం శక్తి కేంద్రాలు, బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి రాత్రింబవళ్ళు క్షేత్రస్థాయిలో కష్టపడుతుంటే, రాహుల్ గాంధీ మాత్రం బాధ్యతారాహిత్యంగా కార్ నికోబార్, వియత్నాం వంటి విదేశీ పర్యటనల్లో విహరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రజాసమస్యల పరిష్కరంపై, హామీల అమలుపై సోయిలేకుండా కేవలం అంతర్గత కుర్చీలాటలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బిజెపి పాలిత రాష్ట్రాల గవర్నెన్స్ మోడల్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.






