- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 25 నుంచి రైతు గోస.. బీజేపీ భరోసా యాత్ర
రాష్ట్రంలో ఈనెల 25 నుంచి రైతు గోస– బీజేపీ భరోసా పేరిట కాషాయం పార్టీ యాత్రకు ఏర్పాట్లు చేసింది.

- మూడు రోజుల పాటు ధాన్యం కేంద్రాల్లో నిరసనలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈనెల 25 నుంచి రైతు గోస– బీజేపీ భరోసా పేరిట కాషాయం పార్టీ యాత్రకు ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు తాండూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రం దర్శించి అదే రోజు రాత్రి గజ్వేల్చేరుకుని బస చేస్తారు. రెండవ రోజు గజ్వేల్ నుంచి భువనగిరి, వరంగల్ వెళ్లి రాత్రి భూపాలపల్లిలో ఉంటారు. మూడు రోజు భూపాలపల్లి నుంచి కాటారం, మంథని, రాత్రి పెద్దపల్లి జిల్లాలో పోరుబాట నిర్వహించనున్నట్లు ఆపార్టీ శనివారం ప్రకటించింది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వారికి ధాన్యం అమ్మకాల్లో ఎదురై సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 10 గంట నుంచి సాయంత్రం వరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండనున్నారు. పార్టీ అద్యక్షులు రాంచందర్రావు ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగనుంది. పార్టీ వ్యవహారాల ఇంచార్జి అభయ్పాటిల్కూడా పాల్గొంటారు.






