- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. బీజేపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు?
తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో సంస్థాగత ఎన్నిక(Institutional Elections)ల సందడి మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో సంస్థాగత ఎన్నిక(Institutional Elections)ల సందడి మొదలైంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల (District Presidents) ఎంపికపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ 19 జిల్లాలకు ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, అదేవిధంగా జయశంకర్ భూపాల్‌పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు, హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడిగా గంట రవి కుమార్, నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి, జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు, జనగామ- సౌడ రమేశ్, నిజామాబాద్ - దినేష్ కులాచారి, వనపర్తి- నారాయణ, మేడ్చల్ రూరల్ - శ్రీనివాస్, ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్, ములుగు - బలరాం, మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ రెడ్డి, మంచిర్యాల - వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి - సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ - బ్రహ్మానంద రెడ్డి, సికింద్రాబాద్ - భరత్ గౌడ్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.కాగా, మరికొన్ని జిల్లాలకు గాను అధ్యక్షుల నియామకంపై రాష్ట్ర పార్టీ ఇంచార్జీ సునీల్ బన్సల్ (Sunil Sunil Bansal), ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్ (Aravind Menon), రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి (Kishan Reddy)లు కేంద్ర నాయకత్వంతో చర్చిస్తున్నారు.






