- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: కాంగ్రెస్ మార్పు అని చెప్పింది ఇదేనా..? బీజేపీ ఎంపీ డీకే అరుణ
మార్పు తెస్తామని చెప్పి, తెలంగాణ తల్లి(Telangana Thalli)ని కూడా మార్చేశారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు(Mahaboob Nagar MP), బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మార్పు తెస్తామని చెప్పి, తెలంగాణ తల్లి(Telangana Thalli)ని కూడా మార్చేశారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు(Mahaboob Nagar MP), బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) సచివాలయం(telangan Secretariet)లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి ఇదేం ఖర్మ అంటూ.. కీర్తి కిరీటంతో కళకళలాడే తెలంగాణ తల్లిని బోసిగా నిలబెట్టారని చెప్పారు. అలాగే తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను తొలగించారని, ఎర్రని చీరతో దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లికి పచ్చ చీర చుట్టారని తెలిపారు. అంతేగాక ఆఖరికి భంగిమను కూడా హస్తం గుర్తుకు చిహ్నంగా మార్చుకున్నారని చెబుతూ.. మర్పు తెస్తామని మోసగించారని, తెలంగాణ తల్లినే మర్చేశారని డీకే అరుణ మండిపడ్డారు.






