'భూ దందా'లకు కేంద్రబిందువు బీజేపీ.. పీసీసీ నేత రామ్మోహన్ రెడ్డి

by Geesa Chandu |

భూ దందాలకు కేంద్ర బిందువు బీజేపీ అని.. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉండి కూడా రాష్ట్రానికి వెలగబెట్టింది ఏమీ లేదని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

భూ దందాలకు కేంద్రబిందువు బీజేపీ.. పీసీసీ నేత రామ్మోహన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: భూ దందాలకు కేంద్ర బిందువు బీజేపీ అని.. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉండి కూడా రాష్ట్రానికి వెలగబెట్టింది ఏమీ లేదని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఫైర్ అయ్యారు రామ్మోహన్. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

అసలు.. కేసీఆర్ ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళాడా..?

తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం అమెరికాలో పర్యటిస్తుంది. అయితే గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేశారా? అని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ధర్మం పేరుతో బీజేపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని అన్నారు. రక్షణ భూములు కొట్టేశామని బండి సంజయ్ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు పాదయాత్ర పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే కదా అతన్ని బీజేపీ స్టేట్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది అని ఆయన ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు.

Next Story