- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోంది.. TPCC చీఫ్ తీవ్ర ఆరోపణలు
ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan)తో కలసి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈసీని తమ గుప్పిట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతోందని అన్నారు. ‘ఓట్ చోరీ’ అవకతవకలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. హర్యానా (Haryana)లో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలకు భావించారని, అక్కడ ప్రజలకు అభిప్రాయలకు వ్యతిరేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు ఉన్నాయని.. ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉండటం దారణమని అన్నారు. ఇక పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానాలో చేర్చారని ఆరోపించారు. బిహార్‌లో తమకు బలం లేని చోట ఓట్లను బీజేపీ తొలగించిందని.. ఈసీ (EC)ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.






