BJP: ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకండి.. సీతక్కపై బీజేపీ ఫైర్

by Prasad Jukanti |

కరాచీ బేకరీ విషయంలో మంత్రి సీతక్క ఆరోపణలను బీజేపీ ఖండించింది.

BJP: ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకండి.. సీతక్కపై బీజేపీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏది జరిగినా బీజేపీపై (BJP) విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. హైదరాబాద్ కరాచీ బేకరీపై దాడి ఘటన విషయంలో మంత్రి సీతక్క (Seethakka) ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని వాస్తవాలు ధృవీకరించుకోకుండానే ఆమె బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఎవరో మంత్రి తేల్చాలన్నారు. కరాచీ బేకరీపై దాడులను తాము ఖండిస్తున్నామని ఈ దాడికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరాచీ బేకరీ దాడి ఘటనను బీజేపీపై నిందవేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని దుయ్యబట్టారు. ఇలా దాడులు చేయడం బీజేపీ సంస్కృతి కాదన్నారు.

Next Story