మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం : ఎన్. రాంచందర్ రావు

by Muthe.Rajitha |

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(N. Ramchandra Rao) ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం : ఎన్. రాంచందర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(N. Ramchandra Rao) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, స్థానిక ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తుందని మరోసారి స్పష్టం చేసారు. బీసీలకు 42% రిజర్వేషన్లను సమర్థిస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లులో ముస్లిం రిజర్వేషన్లను చేర్చి ఓబీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదని, మతపరమైన రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని నొక్కిచెప్పారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ సానుకూలంగా స్పందిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడానికి పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు పార్టీలో అంతర్గత పోరుపై రాంచందర్ రావు స్పందించారు. తమ అంతర్గత వ్యవహారాలు తామే పరిష్కరించుకుంటామని తెలిపారు. కేటీఆర్-కవిత, రేవంత్-కోమటిరెడ్డి మధ్య కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయని అన్నారు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని, హద్దు దాటితే చర్యలు తప్పవు అని పేర్కొన్నారు.

Next Story