BJP: రేవంత్ రెడ్డి సవాలుకు బదులుగా మూసీ నిద్ర.. తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్

by Ramesh Goud |

మూసీ ప్రక్షాళన(Moosi Purification) పై నిరసనగా బీజేపీ నాయకుల(BJP leaders) మూసీ నిద్ర పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఆసక్తికర ట్వీట్ చేసింది.

BJP: రేవంత్ రెడ్డి సవాలుకు బదులుగా మూసీ నిద్ర.. తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెడ్ డెస్క్: మూసీ ప్రక్షాళన(Moosi Purification) పై నిరసనగా బీజేపీ నాయకుల(BJP leaders) మూసీ నిద్ర పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇందులో మూసీ ప్రాంతాల్లో బీజేపీ నాయకుల బసకు సంబంధించిన కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా.. "బీజేపీ మూసీ నిద్ర" అంటూ.. మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి! అని వ్యాఖ్యానించింది.

అలాగే కాంగ్రెస్ పార్టీ కర్కశ పాలనలో పేదలకు గూడు, నీడా దూరమవుతున్నాయని, మూసీ ప్రక్షాళన - సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు పడగొట్టి, బడాబాబులకు ఆ జాగాలను అందచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేసింది. అంతేగాక రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాలుకు బదులుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(G.Kishan Reddy) పిలుపు మేరకు, రాష్ట్ర నాయకత్వమంతా మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న బాధితుల ఇండ్లల్లో, వారితో పాటు మమేకమై జీవించనుందని తెలిపింది. వారికి అండగా బీజేపీ ఉందని భరోసానిచ్చేందుకే బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టిందని పేర్కొంది. ఇక ఈ కార్యక్రమం నవంబర్ 16 సాయంత్రం 4 గంటల నుండి నవంబర్ 17 ఉదయం 9 గంటల వరకు ఉంటుందని వివరించింది.

Next Story