- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా పార్కు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ "ప్రజా వంచన" పాలనపై బీజేపీ మహా ధర్నా
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న "ప్రజా వంచన" పాలనను, పెండింగ్‌లో ఉన్న హామీల అమలును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న "ప్రజా వంచన" పాలనను, పెండింగ్‌లో ఉన్న హామీల అమలును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ఇందిరా పార్కు వద్దకు చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వ "చేతగాని పాలనపై" జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి మేరకు.. పెద్ద ఎత్తున పార్టీ కీలక నేతలు పాల్గొని ఈ ధర్నాను కొనసాగిస్తున్నరు. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని, కుటుంబ పాలన చేసిన బీఆర్ఎస్, నియంత పాలనతో అక్రమాలు, అవినీతి చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక హామిలిచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినప్పటికి హామీలు నెరవేర్చలేదని, ఏ ముఖం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
అలాగే ఇచ్చిన హామిలను నేరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ పిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, బీసీలకు, ఎస్సీఎస్టీలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంత వరక నెరవేరాయో స్పష్టం చేయాలని, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ అంశంపై చర్చకు వస్తారో రావాలని బీజేపీ నుంచి ఏ కార్యకర్తను రమ్మన్నా వాస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామిలను ఎందుకు నేరవేర్చలేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.






