బిగ్ న్యూస్: T-బీజేపీలో ఒక్కసారిగా మారిన సీన్.. బండికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: T-బీజేపీలో ఒక్కసారిగా మారిన సీన్.. బండికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్!
X

ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దూకుడు పెంచారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రేణులు కష్టపడి పనిచేయాలని సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. హై కమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోనే గతంతో పోలిస్తే బండి సంజయ్ తన దూకుడును మరింత పెంచారని ప్రచారం జరుగుతున్నది. బిఫోర్ ఢిల్లీ టూర్.. ఆఫ్టర్ ఢిల్లీ టూర్ అనుకునేంతలా తన నిర్ణయాల్లో బీఎస్కే స్పీడ్ పెంచారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ఫుల్ యాక్టివ్ అయింది. అసలు పార్టీ ఉందా అనే స్థాయి నుంచి బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే స్థాయికి బీఎస్కే తీసుకొచ్చారు. పార్టీ ఎదుగుదలకు క్రియాశీలకంగా పనిచేసి ఢిల్లీ పెద్దల వద్ద మార్కులు కొట్టేశారు. ఆయనపై ఉన్న నమ్మకంతో సంజయ్‌కి అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. బీజేపీలో పార్టీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లే. అయితే రెండు టర్మ్‌లు ఒక నాయకుడు అధ్యక్షుడిగా పని చేసే చాన్స్ ఉంది.

త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనుండడంతో బీఎస్కే సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండబోదని, బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలువురు జాతీయ నేతలు క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందంటూ కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. హైకమాండ్‌కు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బండి సంజయ్‌పై ఉన్న నమ్మకంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ఎదుగుదల కోసం తీసుకునే నిర్ణయాల్లో బండికి మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

‘బండి’కి ఫ్రీ హ్యాండ్

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన పలువురు నేతలు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ మరింత ఎదగాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పలువురు నేతలు ఆయనకు వివరించినట్లు చెబుతున్నారు. పలువురు నేతలు మీడియాతోనూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్నీ విన్న అధిష్టానం చివరకు బండికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అధిష్టానం నుంచి మరోసారి గోహెడ్ అంటూ అభయహస్తం అందడంతో సంజయ్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కట్టు దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నేతలకే స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారంటే సంజయ్‌పై హైకమాండ్‌కు ఎంత నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. కాగా, బండి వ్యాఖ్యలకు తోడు బన్సల్ సైతం పార్టీలో ఎవరేం చేస్తున్నారో? ఏం మాట్లాడుతున్నారో హైకమాండ్‌కు అంతా తెలుసని, అందరి డేటా జాతీయ నాయకత్వం ఉందని చెప్పడం వెనుక సంజయ్‌కి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కొద్ది మంది నేతల హస్తిన టూర్ అనంతరం జరిగిన అనూహ్య పరిణామం పార్టీకి ప్లస్ కానుందా? లేదా? అనేది చూడాల్సిందే.


Next Story