జాయినింగ్స్ పై రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం

by Disha Web Desk 12 |
జాయినింగ్స్ పై రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే భారీగా పార్టీలో చేరికలు అవసరమని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఎవరికి వారుగా నేతలకు టచ్‌లోకి వెళ్తుండటం సమస్యగా మారిందని హై కమాండ్ గుర్తించింది. బీజేపీలో చేరికలు ఆలస్యం కావడానికి ఇదే కారణమని భావిస్తున్నది. అందుకే జాయినింగ్స్ విషయంలో ఎవరికి వారుగా కాగా, బీజేపీ స్టేట్ చీఫ్ తో పాటు కొందరు నేతలు సమిష్టిగా వెళ్లి చర్చలు జరపడం ఉత్తమమని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

నేతల మధ్య వైరంతో..

చేరికల కోసం పార్టీ ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల సమక్షంలో చర్చించిన తర్వాతే నేతలను చేర్చుకోవాలని భావించింది. కానీ నేతల మధ్య ఉన్న వైరం కారణంగా ఆ విధానానికి ఫుల్ స్టాప్ పడింది. కమిటీ సభ్యులతో చర్చిస్తే ఏదో రకంగా పేరు లీక్ అవుతుండడంతో, ఇతర పార్టీల వారు నాయకులు బయటకు వెళ్లనివ్వకుండా దారులు క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు ఎవరికి వారుగా చేరికలపై ఫోకస్ పెట్టారు. సొంత క్రెడిట్ కోసం సింగిల్ గా వెళ్లి చేరే వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఎవరి ద్వారా వెళ్తే ఏమవుతుందోననే భయం జాయిన్ అయ్యే వారిలో నెలకొంటున్నట్లు తెలుస్తున్నది.

దిశా నిర్దేశం..

సమస్యకు చెక్ పెట్టేందుకు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి పలు సూచనలు చేసినట్లు సమాచారం. సింగిల్ గా కాకుండా టీమ్ గా వెళ్లి పని పూర్తి చేసుకుని రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. అలా కుదరని పక్షంలో కనీసం ఇద్దరు నేతలొకసారి, మరోసారి ఇంకో ఇద్దరు చొప్పున సీక్రెట్ గా వెళ్లి చర్చలు జరిపి జాయినింగ్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవల పలువురి జాయినింగ్ లో తమ ద్వారా అంటే తమ ద్వారానే చేరాలని పార్టీ రాష్ట్ర పెద్దలు ఎవరికి వారుగా పట్టుబట్టడంతో కన్ఫ్యూజన్ నెలకొన్నట్లు సమాచారం. అందుకే జాతీయ నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలిసింది.



Next Story

Most Viewed