- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్లతో ఈటల భేటీ
రాష్ట్రంలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో బీజేపీ (BJP) అధినాయకత్వం సన్నాహాలు మొదలు పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో బీజేపీ (BJP) అధినాయకత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)తో పాటు ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal), తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ (Abhay Patil)తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నాహాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీలో కొత్త, పాత వివాదంపై కూడా డిస్కస్ ఛేసినట్లుగా సమాచారం.
రాష్ట్ర కమిటీలో తమ వారికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఈటల, మహేశ్వర్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల బాధ్యతలను పూర్తిగా ఈటల రాజేందర్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ (Work Shops)ను నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్ బన్సల్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర స్థాయి వర్క్షాప్తో పాటు జోనల్ స్థాయి వర్క్షాప్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు ఉమ్మడి జిల్లాలను కలుపుతూ.. ఒక జోన్‌గా చేసి మొత్తం 5 జోన్లు విభజించనున్నారు. జోన్ల వారీగా మండలాధ్యక్షులు ఆ పైస్థాయి కార్యకర్తలకు వర్క్షాప్స్ బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే, సునీల్ బన్సల్‌తో భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు సమావేశం ఉండటంతో ఎంపీ ఈటల మధ్యలోనే వెళ్లిపోయారు.






