రాజ్యాంగం, సుప్రీం కోర్టు ఆదేశాలను BJP గౌరవించదు.. KTR సెటైరికల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-16 05:01:47  IST  )

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) భారత రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలను గౌరవించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కామెంట్ చేశారు.

రాజ్యాంగం, సుప్రీం కోర్టు ఆదేశాలను BJP గౌరవించదు.. KTR సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) భారత రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలను గౌరవించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కామెంట్ చేశారు. ఇవాళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ‘X’ (ట్విట్టర్) వేదికగా బీజేపీ వైఖరిపై ఆయన తాజాగా ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఊహించినట్లుగానే వక్ఫ్ సవరణ చట్టం-2025 (Waqf Amendment Act-2025)పై సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించడంతో కొంత మంది బీజేపీ భక్తులు కలవరపడ్డారని అన్నారు. వారు భారత రాజ్యాంగాన్ని గానీ, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గానీ గౌరవించరని ఎద్దేవా చేశారు. బీజేపీ నీచమైన వైఖరి ఎప్పుడు ఇలాగే ఉంటుందని కేటీఆర్ అన్నారు.

ఐదు నెలల క్రితం పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అమాయక పౌరులు నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అయినా.. మన దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan) జట్టుతో క్రికెట్ ఆడటంపై బీజేపీ స్పందించదని కామెంట్ చేశారు. పహల్గాంలో జరిగిన అమానవీయ ద్రోహానికి వ్యతిరేకంగా బాధిత కుటుంబాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ.. జాతీయవాదం తమ బ్రాండ్ అన్నట్లుగా వ్యహరించే బీజేపీ (BJP) ఈ విషయంపై సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అక్షరాల నిజమైన జాతీయవాదం కలదని.. కులం, మతం, వర్గం లేకుండా ప్రతి భారతీయుడిని సమానంగా చూడటమే తమకు తెలుసని అన్నారు. జాతీయత దేశాన్ని నిర్మించడానికి లేదా రక్షించడానికి ప్రయత్నిస్తుందని.. కానీ, జింగోయిజం ఆధిపత్యం, అహంకారం కూడకుందని ఈ రెండిటి మధ్య సన్నని గీతను తెలియజేస్తుంది.. జైహింద్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story