- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోవా బన్ వలీకి సపోర్టుగా నిలిచిన వారు జిహాదీలు.. బీజేపీ కార్పోరేటర్ వీడియో
బీజేపీ సరూర్ నగర్ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ ముసుగులో కొందరు భారత్ ను ధర్మాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఉంటూ సెక్యులర్ ముసుగులో విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మేడారం జాతరలో కోవా బన్ అమ్మిన వలి అనే వ్యక్తిపై కొందరు మీడియా పేరుతో దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. బన్ పాడైపోయిందని, కోవాలో రవ్వ కలిపారని అతడిపై బెదిరింపులకు పాలప్పడ్డారు. అతడితో ఆ బన్ తినిపించారు. మీడియా పేరుతో దౌర్జన్యం చేస్తున్న వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో చాలా మంది అతడికి సపోర్ట్ గా నిలిచారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం వలికి మద్దతు తెలుపుతూ అతడిని కలుస్తానని చెప్పారు. కాగా తాజాగా బీజేపీ సరూర్ నగర్ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ ముసుగులో కొందరు భారత్ ను ధర్మాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు.
దేశంలోనే ఉంటూ సెక్యులర్ ముసుగులో విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఫుడ్ అడల్ట్రేషన్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతోందని అన్నారు. పాకిస్థాన్ వాళ్లు బంగ్లాదేశ్ వాళ్లు కలిసి ఈ కుట్ర చేస్తున్నారని అన్నారు. ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల చిన్నయసులోనే అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారని అన్నారు. అబ్బాయిలకు పిల్లలు పుట్టకుండా తయారవుతున్నారని అన్నారు. పాలకోవను ఇప్పుడు రవ్వ బన్ అని అమ్ముతున్నారని చెప్పారు. కోవా బన్ అమ్మడం అనేది ఫుడ్ జిహాది అన్నారు. కేజీ 500 రూపాయలు ఉన్న కోవాను రూ.10కే ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు.






