- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: రాజ్యాంగంపై కుట్రపూరిత ప్రయత్నాలు.. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని కాపాడండి అని కొంతమంది కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ(Malkjgiri MP) ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగాన్ని కాపాడండి అని కొంతమంది కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ(Malkjgiri MP) ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి(BR Ambedkar Death Anniversary) సందర్భంగా నాంపల్లి(Nampally)లోని బీజేపీ పార్టీ కార్యాలయం(BJP party Office)లో ఆయన చిత్రపటానికి నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా ప్రజానికమంత జరుపుకుంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని కాపాడండి అని కొంత మంది రాజకీయ వక్తలు కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్నాడని, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, పార్లమెంట్ లో అడుగు పెడుతున్నప్పుడు రాజ్యాంగానికి మొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తానని ప్రతిజ్ఞ పునాడని గుర్తు చేశారు. అలాగే అంబేద్కర్ ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద, సమస్త ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పిన మహనీయుడని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఇక అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడి ఆశయాలను గుర్తు చేసుకొని, వాటిని అమలు చేయడం కోసం కృషి చేయాలని ఈటల చెప్పారు.






