కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ సీఎం వ్యాఖ్యలు..!

by Chukka Sudharani |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ సీఎం వ్యాఖ్యలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తుంటే.. ఈ బాగోతం నడిపించింది బీజేపీ నేతలే అనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో టీఎస్పీఎస్సీ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ డైలాగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి లోకం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు ఇరుకున పెట్టేలా మారాయి.

తమ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కావడం తమ ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. అసోంలో మార్చి 13వ తేదీన జరగాల్సిన జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆదివారం రాత్రే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి పరీక్షను రద్ధు చేశారు. అయితే ఈ ఘటనపై గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం హిమంత స్పందించారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. పేపర్ లీకేజీ కావడం అంటే అది తమ వైఫల్యమేనని తప్పును అంగీకరించారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్ లో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేసీఆర్ స్పందిస్తారా ?

టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ లీకుల వ్యవహరం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి కానీ టీఎస్పీఎస్సీ నుంచి సరైన స్పందన రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో డబ్బులకు ప్రశ్నాపత్రాల అమ్మజూపిన వ్యవహారంపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రియాక్ట్ కాలేదు. మంత్రులు స్పందించినా అది బీజేపీపై నెపం వేస్తున్నారనే తప్ప అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు ఇలా పబ్లిక్ లో అమ్మకానికి పెట్టేనా ఎందుకు పసిగట్టలేకపోయామనేదానికి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో అసోంలోని బీజేపీ సీఎం తమ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవరాన్ని అంగీకరించడం హాట్ టాపిక్ గా మారింది. హిమంత బిశ్వ శర్మ తమ ప్రభుత్వ తప్పును అసెంబ్లీ వేదికగా అంగీకరిస్తే తెలంగాణ సీఎం మాత్రం కనీసం ఈ అంశంపై రియాక్ట్ కూడా కావడం లేదనే చర్చ జరుగుతోంది.


Next Story