- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ ధర్మాన్ని అణిచివేసేందుకు తెస్తున్న హేట్ స్పీచ్ చట్టం : బీజేపీ చీఫ్ రాంచందర్రావు
హేట్ స్పీచ్ బిల్లు–2025 తరహాలోనే, తెలంగాణలో కూడా సారూప్యమైన చట్టాన్ని అమలు చేయడం తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన హేట్ స్పీచ్ బిల్లు–2025 తరహాలోనే, తెలంగాణలో కూడా సారూప్యమైన చట్టాన్ని అమలు చేయడం తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. హేట్ స్పీచ్ చట్టం అనేది తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించడానికి, వారిని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా నోరు మూయించడానికి మాత్రమే తీసుకువస్తున్న చట్టంగా భావిస్తున్నామన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను తిట్టేవాళ్లకు మద్దతుగా బిల్లు తెస్తోంది. ఈ చట్టం అసలు లక్ష్యం హిందువులు ఏం మాట్లాడకుండా చేయడం, హిందూ ధర్మ స్వరాన్ని అణచివేయడమేనన్నారు. ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని మాట్లాడింది కూడా కాంగ్రెస్ నాయకులేనని,
హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవీదేవతలను హేళన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండీ అలయెన్స్ పార్టీలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు విద్వేషాలకు వ్యతిరేకంగా హేట్ స్పీచ్ చట్టం తీసుకొస్తామంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారని, రాజకీయాల్లో మళ్లీ మార్పు వస్తుందని చెబుతున్నారు. కానీ తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ పనిచేయవన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, ఫ్యూడలిజాన్ని, వారి పాలనా పనితీరును తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ఒక్క బీజేపీ పార్టీయే అని పేర్కొన్నారు.






