- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు జూబ్లీహిల్స్ నాంది: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యనే పోటీ ఉందని, అక్కడి ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 పెరుగుతాయని, మజ్లిస్ శక్తిని ఆపాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యనే పోటీ ఉందని, అక్కడి ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 పెరుగుతాయని, మజ్లిస్ శక్తిని ఆపాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (N. Ramchander Rao) పేర్కొన్నారు. నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశాలు పెరుగుతున్నాయని, ప్రజల్లో తమ పార్టీని గెలిపించాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పలు డివిజన్ల బాధ్యతలు జిల్లా నేతలకు అప్పగించారు. గెలుపే ధ్యేయంగా పని చేయాలని ఇంచార్జీలను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం, ప్రభుత్వం వ్యతిరేక విధానాలు, బీఆర్ఎస్ పదేళ్ల దోపిడీ ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని, ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికలపై కేంద్ర ఇంచార్జి లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వేముల అశోక్, చంద్రశేఖర్ తో నేతలతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల్లో ఎదుర్కొని ఏ విధంగా విజయం సాధించాలనే విషయాలపై చర్చించారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటితే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం కైసవం చేసుకోవచ్చని అంచనా వేశారు.






