- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత రాజకీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యత : బీజేపీ చీఫ్రాంచందర్రావు
కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదు అనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ మతాధారిత ఓటు బ్యాంక్ రాజకీయాలు నమ్ముతున్నట్లు మరోసారి స్పష్టమైందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదు అనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ మతాధారిత ఓటు బ్యాంక్ రాజకీయాలు నమ్ముతున్నట్లు మరోసారి స్పష్టమైందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు. సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తుందన్నారు. సామాజిక విభేదాలను రాజకీయ లాభం కోసం రెచ్చగొట్టే ప్రమాదకర ప్రయత్నమన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 20 శాతం ముస్లింల ఓట్ల కోసం, 80 శాతం హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీనిని సెక్యులరిజం అని చెప్పడమంటే ప్రజలను మోసం చేయడమే అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే, పాలనతో, పనితీరుతో కాదు సమాజాన్ని మతం ఆధారంగా విభజించి అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం అని స్పష్టమవుతోంది. మంత్రి పదవులు సైతం ఎన్నికల లాభం కోసం మత ప్రాతిపదికన పంచడం సిగ్గుచేటుని, ముస్లిం సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల దిశగా చర్యలు తీసుకోవాలి.
సమాజాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో, విభజించి రాజకీయ లాభం పొందే ధోరణి కాంగ్రెస్‌కి సర్వసాధారణమైందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు అహంకార రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారు. ముఖ్యమంత్రి చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలతో పాటు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయోజనాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు ప్రజాస్వామ్యానికి అవమానం, ప్రజల స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రజలతో ఉందని యావత్ జాతిని, సమాజాన్ని ఏకీకృతం చేసే శక్తిగా నిలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపిదే విజయమని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను రక్షించడమే రేవంత్ రెడ్డి బాధ్యతా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా, బీఆర్ఎస్ కాలంలో ఉన్న ముఖ్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిశ్శబ్దం వెనుక ఏ ఒప్పందం దాగి ఉందన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడినట్లే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ను అనేక కేసుల నుంచి తప్పిస్తోంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిని బద్నాం చేయాలనే కుట్రలు ఇక నుంచి సాగవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండనుంది. బిజెపిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.






