Ramchander Rao: కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బయటపడింది

by Gantepaka Srikanth |

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు.

Ramchander Rao: కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బయటపడింది
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి, బాన్సువాడ, రుద్రూర్‌లలో ఇటీవల జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ 'బుజ్జగింపు రాజకీయాలకు' నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బయటపడిందని అన్నారు. అసలు ఏ నైతిక హక్కుతో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీలోనూ విఫలమైన ఆయనకు ప్రజల ముందుకు వచ్చే అర్హత ఉందా? బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిన రూ.1,000 కోట్ల వసూళ్ల కోసమే ఆయన ఇక్కడికి వచ్చినట్లుందని విమర్శించారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ "గడ్డపార ప్రభుత్వం"గా మారి, మూసీ నుంచి ఖమ్మం వరకు పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ వారిని రోడ్డున పడేస్తోంది. ఎన్నికల ముందు గొప్పగా ప్రగల్భాలు పలికి, అధికారంలోకి రాగానే అటకెక్కించిన 400 హామీల కోసం తెలంగాణ సమాజం ఇంకా ఎదురుచూస్తూనే ఉందని రాంచందర్ రావు తెలిపారు.

Next Story