- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనతో పొత్తులేదు ఒంటరిగా బరిలో ఉంటాం: బీజేపీ చీప్ రాంచందర్ రావు
దేశంలో ఉపాధి హామీ పథకం 1960ల నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకం నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఉపాధి హామీ పథకం 1960ల నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకం నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపాలను సరిదిద్ది పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతతో వీబీ జీ రామ్‌జీ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఉపాధి పథకంపై కార్యాశాల నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారే దిశగా దృఢంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నేడు అతిపెద్ద 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని తెలిపారు. మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా పాత సంక్షేమ మోడళ్లలో మార్పులు అవసరమని, అందుకే వీబీ జీ రామ్‌జీ చట్టం అవసరమే కాకుండా అనివార్యమని స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీ పేరుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న మక్కువ చూపడం ఆశ్చర్యంగా ఉందని, రాజీవ్, ఇందిర గాంధీ పేర్లకు బదులుగా హైదరాబాద్ విమానాశ్రయానికి మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. 1989లో జవహర్ రోజ్ గార్ యోజన నుంచి ప్రారంభమైన ఉపాధి పథకాలు అనేక మార్పులు చెంది, 2005లో నారేగా మారాయని, ఆ సమయంలో మహాత్మా గాంధీ పేరు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్‌కు రాలేదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పేదలకు ఉపయోగపడటం లేదని, అవినీతి జరుగుతుందని గతంలో రాహుల్‌గాంధీ ఆరోపణలు చేసిన సంగతి నేటి కాంగ్రెస్పాలకులకు గుర్తులేదని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో నకిలీ జాబ్ కార్డులు, కల్పిత పనులు, లేనిపోని వ్యక్తులకు చెల్లింపుల ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని చెప్పారు. ఒడిశా సంబల్పూర్ జిల్లాలో మరణించినవారికి, పని చేయలేని వారికి, పెన్షనర్లకు వేతనాలు చూపించడం, నకిలీ పని దినాలు, డూప్లికేట్ బిల్లులు వంటి అవకతవకలు జరిగాయని వివరించారు.
వీబీ జీ రామ్‌జీ చట్టం ద్వారా ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంపు, కనీసం 50 శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారా అమలు జరుగుతుంది. గ్రామసభలు, గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టడమని తెలిపారు. అలాగే తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, జీపిఎస్-శాటిలైట్ మానిటరింగ్, ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు, వారానికొకసారి ప్రజా ప్రకటనలు వంటి చర్యలతో లీకేజీలకు పూర్తిగా చెక్ పెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతమ్ రావు , సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ , సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి , పాపయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్‌ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదు :
త్వరలో జరిగే మున్సిపల్‌ఎన్నికల్లో జనసేన పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు. తాము ఒంటరిగా బరిలో దిగుతామని ఇప్పటికే సర్పంచుల ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటినట్లు పేర్కొన్నారు. జనసేన వారి తెలంగాణలో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపిలో జతగా ఉన్న తెలంగాణలో ఉండాలని నిబంధన ఎక్కడ లేదన్నారు. సింగిల్‌గా పోటీ చేసి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ను దెబ్బతీస్తామని పేర్కొన్నారు. ఈరెండు పార్టీల అవినీతి బాగోతాలు, చీకటి ఒప్పందాలను ప్రజలకు వివరిస్తామన్నారు.






