పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ? బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

by Ramesh Naini |

ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ? బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు (BJP Chief Ramchander Rao) మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. అక్రమ ఓటర్ల జాబితాను తీసివేస్తే ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని నిలదీశారు. ఎస్ఐఆర్‌తో భారతీయులకు ఎలాంటి నష్టం వాటిల్లిందని వెల్లడించారు. చొరబాటు దారులకి ఓట్లు ఉండాలని కాంగ్రెస్ అంటోందని ఆరోపించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు దేశ ప్రజలు సిద్దంగా ఉన్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు రాజ్యాంగాన్ని కాలరాసింది, పనికిరాని అంశాలను కాంగ్రెస్ ప్రజల ముందు పెడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.

Next Story