- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ వల్ల తెలంగాణలో గన్ కల్చర్ : బీజేపీ చీఫ్ రామచందర్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వలన గన్ కల్చర్ పెరిగిందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వలన గన్ కల్చర్ పెరిగిందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. నేడు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతోమాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, రైతులను మోసం చేస్తోందని, రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతోందని, సాధారణ వ్యక్తులకే కాక పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పోలీసుల కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కానీ వారు పంటను అమ్మలేని దైన్య స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్, పింఛన్ ఇవ్వడం లేదని, రెండేళ్లుగా బెనిఫిట్స్ రాకపోవడంపై ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేసి, వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని, మజ్లీస్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను దెబ్బతీస్తోందని రామచందర్‌రావు తీవ్ర ఆరోపణలు చేసారు.






