- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రామచంద్ర రావు ఫైర్
కొంతమంది ఎలాంటి అర్హతలు లేకున్నా యూట్యూబ్ జర్నలిస్టులం అని చెప్పుకుని సీనియర్ జర్నలిస్టులకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని సీఎం రేవంత్ ఓ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఎలాంటి అర్హతలు లేకున్నా యూట్యూబ్ జర్నలిస్టులం అని చెప్పుకుని సీనియర్ జర్నలిస్టులకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని సీఎం రేవంత్ ఓ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చూస్తే చెంప చెల్లుమనిపించాలని అనిపిస్తుందని, కానీ హోదా అడ్డు వస్తుందన్నారు. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా? అని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.






