సుప్రీంకోర్టు తీర్పు ముందే ఊహించాం.. బీసీ రిజర్వేషన్ల విచారణపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సుప్రీం కోర్టు తీర్పును మేము ముందే ఊహించామని బీజేపీ చీఫ్ రామ్ చందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ముందే ఊహించాం.. బీసీ రిజర్వేషన్ల విచారణపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది. ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ తరఫు లాయర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్‌చందర్ రావు (Ramchander Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును మేము ముందే ఊహించామని ఆయన తెలిపారు.

హైకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదని, ఈ విషయం చిన్న పిల్లోడికి కూడా ఈ విషయం తెలుసన్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సాధించింది ఏముంది? అని ఆయన విమర్శించారు. వారు ఆర్భాటంగా ఢిల్లీకి ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారని, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంట్లో వారు చేసిన ఘనకార్యం ఏమీ లేదని, అది ఒక టెక్నికల్ ఇష్యూ గా అభివర్ణించారు.

Next Story